Delhi: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందా ?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిందని ఆనందించేలోగా..మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది కరోనా వైరస్. రెండవసారి కేసులు నమోదవడం సెకండ్ వేవ్ గా పరిగణించవచ్చా మరి ?

Last Updated : Sep 3, 2020, 05:26 PM IST
Delhi: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందా ?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ( Delhi corona cases ) మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిందని ఆనందించేలోగా..మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది కరోనా వైరస్ ( Corona virus ) . రెండవసారి కేసులు నమోదవడం సెకండ్ వేవ్ గా పరిగణించవచ్చా మరి ?

కరోనా సంక్రమణ తొలిదశలో ఢిల్లీ టాప్ ( Delhi ) లో ఉంది. ఆ తరువాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టి..మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కువైంది. కొద్దిరోజుల క్రితం వరకైతే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవసాగాయి. దాంతో అందరూ ఊపిరిపీల్చుకునేలోగా మరోసారి కరోనా వైరస్ దేశ రాజధానిలో ప్రతాపం చూపిస్తోంది. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి. గత 24 గంటల్లో అయితే 2 వేల 509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) ప్రారంభమైందనే సంకేతాలు వచ్చాయి. అయితే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రం ఈ సంక్రమణను సెకండ్ వేవ్ గా అంగీకరించడం లేదు. ఓ రెండు నెలల పాటు జీరో కేసులు నమోదై...ఆ తరువాత కొత్త కేసులు వెలుగుచూస్తేనే దాన్ని సెకండ్ వేవ్ గా పరిగణిస్తామంటున్నారు. ఢిల్లిలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1 లక్షా 79 వేలు దాటింది. మరణాల సంఖ్య 5వేలకు చేరువలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 30-35 వేల పరీక్షలు చేస్తున్నారు.  ఈ సంఖ్యను మరో 20-40 వేల వరకూ పెంచుతామంటున్నారు మంత్రి సత్యేంద్ర జైన్. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం చేస్తుండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. Also read: Corona virus: ఆ వయస్సు వారికే ఎక్కువ..కారణాలేంటి ?

Trending News