కాశ్మీర్ పోలీసుల రూటే వేరప్ప ..!!

'కరోనా వైరస్'..  ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.

Last Updated : Mar 31, 2020, 04:45 PM IST
కాశ్మీర్ పోలీసుల రూటే వేరప్ప ..!!

'కరోనా వైరస్'..  ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.

ఈ క్రమంలో కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని పోలీసులు 24  గంటలు డ్యూటీ చేస్తున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారు. ఐతే జనం అంత సామాన్యంగా పోలీసుల  మాట వింటారా..! ఇప్పటికే నయానో భయనో  పంపించే ప్రయత్నం చేశారు పోలీసులు.  అక్కడక్కడ లాఠీ కూడా ఝుళిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు కూడా  చూశాం.   అక్కడక్కడ జనం కూడా పోలీసులపైనా తిరగబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తమిళనాడులో పోలీసులు జనాన్ని భయపెట్టేందుకు ఏకంగా కరోనా హెల్మెట్ కూడా తయారు  చేయించారు. మరోవైపు  జమ్మూ కాశ్మీర్ పోలీసులు మాత్రం మా రూటే సపరేటు అంటూ వినూత్న ప్రయత్నం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఏకంగా క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

20 పడకలు ఉన్న క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు  చేసి.. ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన వారికి అక్కడికే తరలించే  ఏర్పాటు చేశారు.కిష్టవార్ జిల్లాలో ఈ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటైంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News