కాంగ్రెస్ అడిగిన కీలక శాఖలు ఇవ్వనంటున్న కుమారస్వామి!

కీలక శాఖల కోసం జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ !

Last Updated : May 29, 2018, 04:46 PM IST
కాంగ్రెస్ అడిగిన కీలక శాఖలు ఇవ్వనంటున్న కుమారస్వామి!

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్), కాంగ్రెస్ పార్టీలు కీలక శాఖల కేటాయింపు విషయంలో ఇంకా ఓ ఏకాభిప్రాయానికి రావాల్సి వుంది. హోంమంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోల కేటాయింపుల అంశంపై ఇప్పటికే పలుమార్లు కూటమి అగ్రనేతలు సమావేశమైనప్పటికీ, ఇరువర్గాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరడంలేదు. హోంమంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖలను కాంగ్రెస్ పార్టీ తమకే కేటాయించాల్సిందిగా కోరుతుండగా, ఆర్థిక శాఖను మాత్రం ముఖ్యమంత్రి కుమారస్వామి తన పరిధిలోనే ఉండాల్సిందిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కూటమిలో పోర్ట్‌ఫోలియోల పంపకాల విషయంలో బేధాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. 

ఇదే విషయమై ఆదివారంనాడు ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. "ప్రజలు జేడీఎస్ పార్టీకి మెజార్టీ కట్టబట్టకుండా తిరస్కరించారు. అయినాసరే కాంగ్రెస్ మద్దతుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. అలా కాకుండా ప్రజలే తమ జేడీఎస్ పార్టీకి మెజార్టీ కట్టబట్టి వుంటే, ఇవాళ తాను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అందుకు ఎవ్వరి అనుమతి అవసరం అయ్యేది కాదు. కేవలం ప్రజలే పరమావధిగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమ ప్రభుత్వానికి వుండేది. కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ దయాదాక్ష్యిణ్యాల వల్లే తమ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తమ ప్రభుత్వానిది" అని ముఖ్యమంత్రి  కుమారస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. 

Trending News