JEE Main 2024 Admit Cards: జేఈఈ మెయిన్ 2024 రెండవ విడత అడ్మిట్ కార్డులు విడుదల, డౌన్‌లోడ్ ఇలా

JEE Main 2024 Admit Cards: దేశంలోని దిగ్గజ ఐఐటీలు, ఎన్ఐటీల్లో అడ్మిషన్లపై నిర్వహించే జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. జేఈఈ మెయిన్ 2024 రెండో విడత పరీక్షల అడ్మిట్ కార్జులు విడుదలయ్యాయి. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2024, 12:26 PM IST
JEE Main 2024 Admit Cards: జేఈఈ మెయిన్ 2024 రెండవ విడత అడ్మిట్ కార్డులు విడుదల, డౌన్‌లోడ్ ఇలా

JEE Main 2024 Admit Cards Download Online: దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతియేటా జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రతిసారీ రెండు సెషన్లలో జరుగుతుంటాయి. మొదటి జనవరిలో ముగియగా రెండవ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2024 రెండో సెషన్ పరీక్షల అడ్మిట్ కార్డులను నిన్న అంటే మార్చ్ 31 అర్ధరాత్రి విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అదికారిక వెబ్‌సైట్ https://jeemainsession2.ntaonline.in/frontend/ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2024 రెండవ సెషన్ పరీక్ష రాస్తున్న విద్యార్ధులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 319 కేంద్రాల్లోనూ విదేశాల్లో 22 పట్టణాల్లోనూ జేఈఈ మెయిన్ 2024 రెండవ సెషన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఏప్రిల్ 4, 5,6,8,9 తేదీల్లో పేపర్ -2 పరీక్ష ఉంటుంది. ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ పేపర్ 2ఎ బీఆర్క్, పేపర్ 2బి బీ ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి. 

జనవరి నెలలో జరిగిన జేఈఈ మెయిన్ మొదటి విడతలో 23 మంది విద్యార్ధులు 100 పర్సంటైల్ సాధించగా తెలుగు రాష్ట్రాల్నించి 10 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ మెయిన్ ఉత్తీర్ణత పొందినవారికే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి వీలుంటుంది. అడ్వాన్స్‌లో ఉత్తీర్ణత పొందితేనే ఐఐటీల్లో ప్రవేశముంటుంది. లేకుంటే ఎన్ఐటీలకు పరిమితం కావల్సి ఉంటుంది. ఈసారి జేఈఈ మెయిన్ 2024 పరీక్షలకు 12 లక్షలమంది హాజరుకానుండగా అందులో తెలుగు రాష్ట్రాల్నించి 2.4 లక్షలమంది ఉన్నారు. 

Also read: Honor 9Xb Phone: 108 మెగాపిక్సెల్ కెమేరా, 8జీబీ ర్యామ్‌తో హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News