JP Nadda: ఉత్కంఠకు తెర.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే..!

BJP National President JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మళ్లీ ఎన్నికయ్యారు. జూన్ 2024 వరకు ఆయన పదవీ కాలం పొడిగించినట్లు అమిత్‌ షా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 05:04 PM IST
JP Nadda: ఉత్కంఠకు తెర.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే..!

BJP National President JP Nadda: బీజేపీ కొత్త అధ్యక్షుడిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ కొత్త అధ్యక్షుడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మాత్రమే ఉంటారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించినట్లు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురాగా.. బీజేపీ సభ్యులందరూ ఆమోదించారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా జూన్ 2019లో పార్టీ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జేపీ నడ్డా కృషి చేశారని కొనియాడారు. జేపీ నడ్డా నాయకత్వంలో పార్టీ అంతా కలిసి ఐక్యమైత్యంగా పని చేసిందన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రజలకు సేవ చేయడంలో పార్టీ చేసిన కృష్టిని గుర్తుచేశారు. నడ్డా నాయకత్వాన్ని అభినందిస్తూ.. ఆయన నాయకత్వంలో పార్టీ అనేక రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిందని  అన్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందే.. నడ్డా పార్టీ అధ్యక్షుడిగా మరోసారి కొనసాగుతారని ఊహాగానాలు వినిపించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లే జేపీ నడ్డా పేరును ప్రకటించారు. దేశ రాజధానిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వచ్చే ఎన్నికల వ్యూహంపై చర్చించారు. 

అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లోనూ, ఆ తరువాత 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని కార్యవర్గానికి పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం సోమవారం ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమై.. మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగంతో ముగిసింది.

Also Read: Comedian Ali: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News