BJP National President JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మళ్లీ ఎన్నికయ్యారు. జూన్ 2024 వరకు ఆయన పదవీ కాలం పొడిగించినట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
భాజపా సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 80 మందితో జాతీయ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది కమలదళం. ఈ కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌గాంధీని తొలగించారు.
Assembly Elections: బీజేపీ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమించింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఆరు నెలల ముందే వేడి రాజుకుంది. బీజేపీ నేతలకు..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ విషయమై తప్పటడుగులు వేసిన జనసేన..ఇకపై కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుపతి సీటును కోరుతూ బీజేపీ ముందు ప్రతిపాదన ఉంచనుంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కీలక శక్తిగా ఎదగడానికి..బలమైన ప్రతిపక్షంగా మారడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తో భేటీలో కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.
ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణను బీజేపీ అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజును నియమించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.