బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ( Kangana ranaut ) మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్ధవ్ థాకరే ( Udhav Thackeray ) కు సవాల్ విసిరిన తరువాత ఇప్పుడాయన పార్టీపై విమర్శలు గుప్పించింది. శివసేన కాదని...సోనియా సేన అని ఎద్దేవా చేసింది.
శివసేన పార్టీపై..ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ( Mumbai municipal corporation ) పై కంగనా రనౌత్ విమర్శలు కొనసాగుతున్నాయి. అధికారం కోసం బాలా సాహెబ్ థాకరే భావజాలాన్ని అమ్మకానికి పెట్టిన పార్టీ ఇప్పుడు శివసేనగా లేదని..సోనియా సేన ( Its not Shiv sena..its sonia sena ) గా మారిందంటూ కంగనా రనౌత్ మరో సంచలన ట్వీట్ చేసింది.
जिस विचारधारा पे श्री बाला साहेब ठाकरे ने शिव सेना का निर्माण किया था आज वो सत्ता केलिए उसी विचारधारा को बेच कर शिव सेना से सोनिया सेना बन चुके हैं, जीन गुंडों ने मेरे पीछे से मेरा घर तोड़ा उनको सिविक बॉडी मत बोलो, संविधान का इतना बड़ा अपमान मत करो 🙏 https://t.co/ZOnGqLMVXC
— Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020
ముంబైలోని పాలి హిల్స్ ( Pali hills ) లో ఉన్న కంగనా ఆఫీసుకు సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాల్ని ముంబై కార్పొరేషన్ ( BMC ) కూల్చేయడంతో కంగనా రనౌత్ కు, శివసేనకు మధ్య వివాదం ప్రారంభమైంది. బీఎంసీ సిబ్బందిని మూర్ఖులుగా కంగనా అభివర్ణించింది. శివసేన పార్టీ స్థాపనలో బాలాసాహెబ్ థాకరే భావజాలాన్ని ఆ పార్టీ అమ్మకానికి పెట్టిందని కంగనా విమర్శించింది. అంతేకాకుండా శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిందంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎన్నికల్లో పరాజయం అనంతరం శివసేన సిగ్గులేకుండా...సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియా సేనగా మారిందని పేర్కొంది.
ఎన్ని నోర్లు మూయిస్తారు..ఎన్ని స్వరాల్ని అణగదొక్కుతారు..ఎంతకాలం నిజం నుంచి దూరంగా పారిపోతారంటూ కంగనా రనౌత్ శివసేన అధినేతల్ని ప్రశ్నించింది. Also read: Rhea case: బెయిల్ పిటీషన్ పై నేడే విచారణ