బారులు తీరిన ఓటర్లు.. కర్ణాటకలో కొనసాగుతున్న ఓటింగ్‌

బారులు తీరిన ఓటర్లు.. కర్ణాటకలో కొనసాగుతున్న ఓటింగ్‌

Last Updated : May 12, 2018, 11:20 AM IST
బారులు తీరిన ఓటర్లు.. కర్ణాటకలో కొనసాగుతున్న ఓటింగ్‌

కర్ణాటకలో ఉదయం 11 గంటల వరకు 24 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా దక్షిణ కర్ణాటకలో 16 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. కర్ణాటక ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, యువత తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన ట్విటర్‌లో కోరారు.

 

 

ఈవీఎంలు మొరాయిస్తున్నాయ్..!

కర్ణాటకలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడుతోంది. షిమోగాలో 31 మంది ఓటు వేసిన తరువాత ఈవీఎంలు మొరాయించాయి. దీనితో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలలో నిలబడి వేచి చూస్తున్నారు. అలానే మాన్వి తాలూకా జక్కలదిన్నిలో పోలింగ్‌ ప్రారంభం కాలేదు. పోలింగ్‌ ప్రారంభం కాని విషయాన్ని పోలింగ్‌ సిబ్బంది అధికారులకు తెలియజేశారు. హుబ్లీలో వీవీప్యాట్ మెషీన్ మొరాయించడంతో పోలింగ్ ను కొద్దిసేపు ఆపేశారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కర్ణాటకలో మొత్తం 4 కోట్ల 96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముల్‌బాగల్‌ నియోజక వర్గంనుంచి అత్యధికంగా 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రముఖ క్రికెటర్లు అనిల్‌ కుంబ్లే  బెంగళూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ బూత్‌కు వచ్చిన అనిల్‌ కుంబ్లే తన ఫొటోలను ట్వీట్‌ చేశారు.

 

మైసూరులో రాజకుటుంబం వడియార్ వంశీయుడు కృష్ణదట్ట చామరాజ వడియార్  ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

 

బెంగళూరులోని కనకపురలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు పెద్దయెత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ప్రజలు పెద్దయెత్తున ఓటింగ్‌లో పాల్గొనాలంటూ ఆయన ట్విటర్‌లో పిలుపునిచ్చారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 60 నుంచి 70 సీట్ల కంటే ఎక్కువ రావని తాము నమ్మకంగా ఉన్నామని కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. 150 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

 

Trending News