Karnataka Omicron Cases: కర్ణాటకలో కొత్త వేరియంట్ కల్లోలం.. ఒక్కరోజే 146 ఒమిక్రాన్ కేసులు..

Omicron Cases:  కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 146 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 06:46 PM IST
  • కర్ణాటకలో ఒమిక్రాన్‌ విజృంభణ
  • ఒకేరోజు 146 ఒమిక్రాన్‌ కేసులు
  • రాష్ట్రంలో కొత్తగా 12వేల కరోనా కేసులు
Karnataka Omicron Cases: కర్ణాటకలో కొత్త వేరియంట్ కల్లోలం.. ఒక్కరోజే 146 ఒమిక్రాన్ కేసులు..

Omicron Cases in Karnataka: కర్ణాటకలో ఒమిక్రాన్‌ కేసులు భారీగా వెలుగుచూశాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 146 ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in Karnataka) బయటపడినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌  (Health minister Dr Sudhakar K) వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 479కి చేరిందన్నారు. ఆ రాష్ట్రంలో ఆదివారం  కొత్తగా 12వేల కరోనా కేసులు (Covid Cases in Karnataka) నమోదయ్యాయి. ఇందులో 9,020 కేసులు ఒక్క  బెంగళూరులోనే బయటపడ్డాయి. కర్ణాటకలో 6.33% పాజిటివ్ రేటు ఉంది. ఆ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం నాటికి  49,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రికాషన్ డోస్ (Covid Precaution Vaccine Dose) ఇవ్వడం ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, (Frontline workers) 60 ఏళ్ల పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ డోసు ఇస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 21 లక్షల మంది ప్రికాషన్ డోస్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 

Also Read: Rajnath Singh Corona: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు కరోనా

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ (Rajesh Bhushan letter to States) రాశారు. యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మంది బాధితులకు ఆస్పత్రి చికిత్స అవసరమవుతోందని తెలిపారు. పరిస్థితి అస్థిరంగా ఉందని, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News