కర్ణాటకలో మా ఎమ్మెల్యేలను బెదిరించారు.. విమానం ఎక్కనివ్వలేదు: గులాంనబీ ఆజాద్

బెంగుళూరు రిసార్టులో ఉన్నప్పుడు తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు పలువురు ఆరోపించారు.

Last Updated : May 19, 2018, 09:02 AM IST
కర్ణాటకలో మా ఎమ్మెల్యేలను బెదిరించారు.. విమానం ఎక్కనివ్వలేదు: గులాంనబీ ఆజాద్

బెంగుళూరు రిసార్టులో ఉన్నప్పుడు తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎమ్మెల్యేలను ఛార్టర్ ఫ్లైట్ల ద్వారా కొచ్చి తీసుకెళ్లాలని భావించామని.. అయితే వారి ప్రయాణానికి పర్మిషన్ ఇవ్వకపోవడం పట్ల ఆశ్చర్యపోయామని ఆయన తెలిపారు.

అందుకే రోడ్డు ప్రయాణం ద్వారా హైదరాబాద్ వెళ్లామని ఆయన అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును కూడా కోల్పోతున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.ఏఎన్‌ఐ వార్తల ప్రకారం, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని తాజ్ క్రిష్ణా హోటల్‌లో బస చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వారికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్నే జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ బీజేపీ వారి హార్స్ ట్రేడింగ్ పద్ధతులను ఎదుర్కోవడానికి తాము తమ ఎమ్మెల్యేలతో కలిసి ఒకే చోట ఉండాలని భావించామని తెలిపారు. బీజేపీ ఇప్పటికే తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మె్ల్యేలతో మాట్లాడిందని ఆయన అన్నారు.

 

Trending News