Palakkad: అక్కడ కొత్త రూల్​.. బైక్​పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు!

Palakkad: కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో బైక్ పై వెనుక సీటులో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఆర్​ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు జిల్లా అదనపు కలెక్టర్.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 03:58 PM IST
Palakkad: అక్కడ కొత్త రూల్​.. బైక్​పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు!

Ban on male pillion riders in Palakkad: బైక్ పై వెనుక సీటులో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు కేరళలోని పాలక్కడ్ (Palakkad) జిల్లా అదనపు కలెక్టర్. ఇటీవలే ఆర్​ఎస్ఎస్ కార్యకర్తను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసినట్లు భావిస్తున్న కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అయితే ఈ నిషేధం నుంచి మహిళలు, చిన్నారులను మినహాయించారు. 

అసలేం జరిగిందంటే..
ఈ నెల 15వ తేదీన ఆర్​ఎస్ఎస్ కార్యకర్త (RSS worker) శ్రీనివాసన్​ షాపులో ఉండగా.. బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి పట్టపగలే అతడిని దారుణంగా హత్య చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య అదే రోజున ఎస్​డీపీఐ ( SDPI) కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగానే జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

వరుస హత్యల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం (Palakkad authorities) అలర్ట్ అయింది. ఈ రెండు హత్యలే కాక మరిన్ని మర్డర్లకు ప్రణాళిక చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అడిషనల్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: Delhi Commuters: సమ్మెతో ఢిల్లీ ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు..పడరాని పాట్లు పడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News