Assembly Election Results 2022 LIVE: ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఇటీవల మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగాయి. 7వ తేదీగనా యూపీలో తుది విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్యే కౌంటింగ్ జరుగుతోందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. భౌతికదూరం పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ వాడటం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని కౌంటింగ్ సిబ్బందికి స్పష్టం చేసినట్లు వివరించింది.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారని ఈసీ వివరించింది.
ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్‌పైనే అందరి దృష్టి ఉంది. ఈ రాష్ట్రాలు దేశ రాజకీయాలకు కీలకంగా ఉండటమే ఇందుకు కారణం. ఎగ్జిట్ పోల్స్‌లో యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడగా.. పంజాబ్‌లో అధికారం చేతులు మారటం ఖాయం అని సర్వేలు అంచాలు ఉన్నాయి.