Chandrayaan 3 Moon Landing Live: యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్షణం మరికాసేపట్లో ఆవిషృతం కానుంది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3.. ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగు పెట్టే క్షణం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. చరిత్ర పుటల్లో భారత్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కానుంది. అంతకుముందే 5:45కి ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానుంది.