Lok Sabha: దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో బంపరాఫర్.. పదేళ్ల తర్వాత ఆ కీలక పదవి..

Lok Sabha - Congress Party: దాదాపు దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో మంచి ఫలితాలను రాబట్టింది. గత రెండు పర్యాయాల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో అపోజిషన్ లీడర్ పదవి దక్కనుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 17, 2024, 05:55 AM IST
Lok Sabha: దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో బంపరాఫర్.. పదేళ్ల తర్వాత ఆ కీలక పదవి..

Lok Sabha - Congress Party: 2024లో దేశ వ్యాప్తంగా జరిగిన 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 292 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మరోవైపు విపక్ష ఇండి కూటమి కూడా మంచి స్కోర్ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  99 సీట్లను గెలిచి బీజేపీ తర్వాత లోక్ సభలో రెండో అదిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈ సారి లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే దక్కాయి. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో 10 శాతం సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 52 సీట్లు వచ్చాయి. అపుడు కూడా అపోజిషన్ హోదా దక్కలేదు. కానీ 2024 ఎన్నికల్లో మొత్తం లోక్ సభ సభ్యుల్లో 10 శాతం కంటే ఎక్కువ లోక్ సభ సభ్యులను గెలుచుకుంది. దీంతో 10 యేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కింది.

గత పదేళ్లలో ప్రతిపక్ష స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దేశంలో దాదాపు ఎనిమిది సార్లు విపక్షాలకు ప్రతిపక్ష హోదా దక్కలేదు.

గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండటంతో లోక్ సభలో ప్రతిపక్షాల బలం నామమాత్రంగానే ఉండింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్(Congress) 2014, 2019 ఎన్నికల్లో చతికిలపడి దిగువసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు దూరమైంది. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 10 శాతం కంటే ఎక్కువగా లోక్ సభ సభ్యులను గెలిపించుకుంది. దీంతో 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండనున్నాడు. 2014 నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా, ఈసారి కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు వచ్చాయి. గత పదేళ్లలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యులలో 10 శాతం కంటే తక్కువగా ఉండింది. ప్రతిపక్ష స్థానం ఖాళీ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా దేశంలో ఎనిమిది సార్లు ఇలాగే జరిగింది.

 ఫస్ట్ టైమ్.. దేశ ప్రథమ ప్రధాన మంత్రిగా ఎన్నికైన జనహర్ లాల్ నెహ్రూ మయంలో ప్రతిపక్షాలకు ఆ హోదా దక్కలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. నాల్గో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ రామ్ సుభాగ్ అపోజిషన్ లీడర్ గా ఎన్నికై రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఐదో లోక్ సభ, ఏడు, ఎనిమిదవ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరికీ 10 శాతం సీట్లు రాకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది.

2014 లో జరిగిన 16వ లోక్ సభ ఎన్నికల్లోను, 17వ లోక్ సభ ఎన్నికల్లోనే ప్రతిపక్ష హోదా ఎవరికీ దక్కలేదు. దీంతో లోక్ సభలో అపోజిషన్ లీడర్ లేకుండా పోయాడు. 18వ లోక్ సభలో ఫస్ట్ టైమ్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోనుంది. రాహుల్ గాంధీ ఈ సారి లోక్ సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News