సర్జికల్ స్ట్రయిక్స్ పై ప్రధాని మోడీ స్పందించారు. రాజస్థాన్ లోని చురు ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటించారు . సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సర్జికల్ స్ట్రయిక్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
మాతృదేశంపై ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని ఎవరి ముందు తలదించనివ్వను ప్రతిజ చేశారు. ఉగ్రమూకల ఏరివేతలో భాగంగా మెరుపు దాడుల వీరులకు నమస్కరిద్దామన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తున్నానన్న మోడీ...ఈ దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురానని ..తమ విజయయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఎవరెన్నె కుట్రలు చేసినా జాతి ప్రయాణం ఆగదు మోడీ ఉద్వేగంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ‘జై జవాన్-జై కిసాన్’ నినాదం గుర్తు చేసుకున్న మోడీ .... ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. తన దష్టిలో వ్యక్తి కన్నా పార్టీ గొప్పది...పార్టీ కన్నా దేశం గొప్పదన్నారు. ఇదే భావనతో తాను పని చేస్తానని వివరణ ఇచ్చుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర సైనికుల స్మృత్యర్థం నిన్న యుద్ధ స్మారకం ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ఈ రోజు తెల్లవారుఝామున భారత వాయుసేన యుద్ధ విమానాలతో దూసుకెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబులేసి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బాంబుల వర్షం ధాటికి 300 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టినట్లు తెలిసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ మేరకు స్పందించారు.