Nagpur Blast: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఘోర దుర్ఘటన సంభవించింది. నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ ప్రాంతంలో ఉన్న సోలార్ ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ కంపెనీలో భారీ పేలుడుతో మంటలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ ప్రాంతంలో ఉన్న కంపెనీ ఇది. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ తయారు చేసే కంపెనీ. కంపెనీలోని కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి. ఫలితంగా 9 మంది మరణించారు. ఇంకా ఎంతమంది మరణించారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంటల్లో చిక్కుకున్న నలుగురిని రక్షించగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో ఎంతమంది పనిలో ఉన్నారు, ఎంతమంది ఆ ప్రదేశంలో చిక్కుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిమాపక బృందాలు, రెస్క్యూ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి.
ఇవాళ ఉదయం 9.30 గంటలకు బొగ్గు బ్లాస్టింగ్ నిమిత్తం గౌన్ పౌడర్‌ను ప్యాక్ చేస్తున్నప్పుడు ఒక ప్యాకెట్ పేలి..అలా ఒక్కొక్కటిగా పేలాయని కంపెనీ యజమాని సత్యనారాయణ తెలిపారు. ఈ కంపెనీ రక్షణ శాఖ కోసం పేలుడు పదార్ధాలు, ఇతర రక్షణ పరికరాలు తయారు చేస్తుంటుంది. ప్రమాజంలో కంపెనీ భవనంలో కొంతభాగం కూలిపోయింది. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో శబ్దం చాలాదూరం వరకూ విన్పించింది. భవన శిధిలాల కింద చాలామంది చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.
రెస్క్యూ పూర్తయితేనే గానీ ఎంతమంది మరణించారనేది కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ప్రాణనష్టం మాత్రం భారీగానే ఉండవచ్చని తెలుస్తోంది.
Also read: Bigg Boss Telugu 7 Leaked: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత అతడే, రేసులోంచి అవుట్ అయిన శివాజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook