త్రిపురలో అతి పేద సీఎం అభ్యర్థి గెలుపు

త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ సత్తా చాటింది. ధన్ పూర్ ప్రాంతం నుండీ పోటీ చేసిన సీఎం మాణిక్ సర్కార్ గెలిచారు.

Last Updated : Mar 3, 2018, 10:49 AM IST
త్రిపురలో అతి పేద సీఎం అభ్యర్థి గెలుపు

త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ సత్తా చాటింది. ధన్ పూర్ ప్రాంతం నుండీ పోటీ చేసిన సీఎం మాణిక్ సర్కార్ గెలిచారు. ఆయన 1998 సంవత్సరం నుంచి త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మార్చి 2008లో, అతను వామపక్ష ప్రభుత్వానికి నాయకుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 2013లో జరిగిన  ఎన్నికలలో అతను వరుసగా నాలుగోసారి సీఎం అయ్యారు. మాణిక్ సర్కార్ తన జీతం మరియు అలవెన్సులను పార్టీకి విరాళంగా ఇచ్చి వార్తలో నిలిచారు. ప్రస్తుతం పార్టీ నుండి జీవనభ్రుతిగా కేవలం 5000 రూపాయలనే ఆయన జీవనభ్రుతిగా పొందుతున్నారు. 19 సంవత్సరాల వయస్సులో అతను భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) లో సభ్యత్వం తీసుకున్నారు.  23 ఏళ్ల వయసులో 1972 లో సి.పి.ఎం రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నిక అయ్యారు.

Trending News