చత్తిస్ ఘఢ్ లో భారీ ఎన్ కౌంటర్... 17 మంది జవాన్ల మృతి....

ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం సువోమాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చేసిన కాల్పుల్లో 17 జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, భద్రతా దళాలకు ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బల్లో

Last Updated : Mar 22, 2020, 06:23 PM IST
చత్తిస్ ఘఢ్ లో భారీ ఎన్ కౌంటర్... 17 మంది జవాన్ల మృతి....

రాయపూర్: ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం సువోమాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చేసిన కాల్పుల్లో 17 జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, భద్రతా దళాలకు ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బల్లో ఇది ఒకటని పోలీసులు పేర్కొన్నారు. 

కాగా సుక్మాలోని మిన్పా అరణ్యాలలో శనివారం 17 మంది జవాన్ల మృతదేహాలనుకనుగొన్నట్లు తెలిపారు. గాయపడిన 14 మంది జవాన్లను సంఘటన స్థలానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌పూర్‌కు చికిత్స కోసం తరలించారు. ఇప్పటివరకు రెస్క్యూ బృందాలు పదిహేడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని, ఛత్తీస్‌ఘఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) డి ఎం అవస్తి తెలిపారు.

మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన భద్రతా దళాలలో 10 ఎకె -47 తో సహా పదిహేను ఆటోమేటిక్ రైఫిల్స్ లేవని పోలీసు అధికారి తెలిపారు. చింతగుఫా ప్రాంతంలోని కోరజ్‌గూడ కొండల సమీపంలో శనివారం మధ్యాహ్నం 1 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు రాష్ట్ర డీజీపీ అవస్తి తెలిపారు. మధ్యాహ్నం 1 గంటల తరువాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని, ఇది సాయంత్రం వరకు కొనసాగగా,తిరుగుముఖం అయ్యే దశలో రాష్ట్ర పోలీసులకు చెందిన 17 మంది జవాన్లు లేరని, 14 మంది గాయపడ్డారని మా దృష్టికి వచ్చిందని అని డీజీపీ అవస్థీ అన్నారు. 

చింతాగుఫా నుండి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 150 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారని, ఎన్‌కౌంటర్‌లో సుమారు 12 మంది మావోయిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయని దీనిపై పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత వివరణ ఇస్తామని అన్నారు. సిపిఐ మావోయిస్టు కు చెందిన హిడ్మా నేతృత్వంలోని 300 మంది మావోయిస్టులు ఉన్నారని, మిన్పా సమీపంలో ఇతర రాష్ట్రాల కార్యకర్తలు సమావేశమవుతున్నారనే స్పష్టమైన సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. గతంలో ఏప్రిల్ 24, 2017న సుక్మాలోని బుర్కపాల్ సమీపంలో మావోయిస్టులు 25 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని హతమార్చారు. కాగా ఇది రెండో అతిపెద్ద దాడి అని అన్నారు.  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News