న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది మృతి చెందిన ఘటన జరిగి 24 గంటలైనా గడవకముందే ఢిల్లీలో మరో చోట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేసింది. పశ్చిమ్ పురిలోని మురికివాడలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 200లకుపైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే 25 అగ్నిమాపక శాఖ యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేసే పనిలో నిమగ్నమయ్యాయి. 2 గంటల అనంతరం పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చామని, గాయపడిన ఓ మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
AK Jaiswal, Fire officer: We got a call around 1 AM that a fire had broken out in slums. We immediately sent 20-25 fire tenders to the spot. It took us 2 hours to control the fire, a woman was injured and has been shifted to a hospital. More than 200 huts were caught in the fire. pic.twitter.com/bQtsgJ0FYa
— ANI (@ANI) February 13, 2019
ఈ అగ్ని ప్రమాదం గురించి అర్ధరాత్రి 1 గంటకు తమకు సమాచారం అందినట్టు అగ్నిమాపక శాఖ అధికారి ఏ.కె. జైశ్వాల్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించారు.