మేఘాలయలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. స్థానిక పార్టీ ఎన్‌పీపీ 18 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ మాత్రం ఇక్కడ ప్రభావం చూపలేకపోతోంది. ప్రస్తుతానికి ఆ పార్టీ మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది. కాగా ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 59 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా..ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 30 స్థానాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడ ఇండిపెండెంట్లు, చిన్నచితక పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి.