షరియత్ చట్టాన్ని లక్ష్యం చేశారు: ఒవైసీ

ప్రధాని మోదీపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. త్రిపుల్ తలాక్ విషయంలో న్యాయం అంటూ ఇస్లాం చట్టం 'షరియత్' ను లక్ష్యం చేసుకున్నారని మండిపడ్డారు.

Last Updated : Jan 23, 2018, 09:59 AM IST
షరియత్ చట్టాన్ని లక్ష్యం చేశారు: ఒవైసీ

ప్రధాని మోదీపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. త్రిపుల్ తలాక్ విషయంలో న్యాయం అంటూ ఇస్లాం చట్టం 'షరియత్' ను లక్ష్యం చేసుకున్నారని మండిపడ్డారు. ఔరంగాబాద్ లో జరిగిన ఒక సభలో ఒవైసీ ప్రధాని మోదీపై నిప్పులుచెరిగారు. బ్యాంకుల్లో రూ.15 లక్షలు వేయకున్నా.. త్రిపుల్ తలాక్ బాధితులకు నెలకు రూ. 15వేలు ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం అవసరమైతే బడ్జెట్ లో  నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. 

మిత్రులారా(బీజేపీని ఉద్దేశిస్తూ..) రూ.15 లక్షలు కాదు.. కనీసం త్రిపుల్ తలాక్ బాధితులకు నెలకు రూ.15 వేలు చొప్పునా ఇవ్వండి అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. త్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించగా.. రాజ్యసభలో ఆమోదం పొందలేదు. 

Trending News