NEET PG 2023: నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడు, పరీక్ష ఎన్ని మార్కులకు

NEET PG 2023: నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చివరి తేదీ ఎప్పుడు, నీట్ పీజీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు, వెయిటేజ్ మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2023, 07:21 AM IST
  • జనవరి 7 నుంచి ప్రారంభమైన నీట్ పీజీ పరీక్ష 2023 రిజిస్ట్రేషన్
  • జనవరి 27 వరకూ నీట్ పీజీ దరఖాస్తుల స్వీకరణ
  • ఫిబ్రవరి 27 నుంచి హాల్ టికెట్లు, మార్చ్ 5న పరీక్ష
NEET PG 2023: నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడు, పరీక్ష ఎన్ని మార్కులకు

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీటీ పీజీ 2023 ప్రక్రియను ప్రారంభించింది. అదికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

నీట్ పీజీ 2023 పరీక్షకై ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ జనవరి 7 నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 27 వరకూ కొనసాగనుంది. నీట్ పీజీ పరీక్ష 2023 ముందుగా అనుకున్నట్టే మార్చ్ 5 వతేదీన ఉంటుంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకూ దరఖాస్తల సవరణకు అంటే ఫోటో, సంతకం, వేలిముద్రల మార్పుకు చివరి అవకాశముంటుంది. పరీక్ష హాల్ టికెట్లను ఫిబ్రవరి 27 న జారీ చేస్తారు. మార్చ్ 5న పరీక్ష నిర్వహించి 31వ తేదీనే ఫలితాలు విడుదలౌతాయి. 

నీట్ పీజీ 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలుంటాయి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐఎంఏ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పరీక్ష ఆన్ లైన్ లో ఉంటుంది.

పరీక్ష ఎన్ని మార్కులకు

నీట్ పీజీ పరీక్ష మొత్తం 800 మార్కులకు ఉంటుంది. మూడు విభాగాల్లో 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ప్రతి ఒక తప్పుకు ఒక మార్కు పోతుంది. 

ఇక పార్ట్ ఎలో 50 ప్రశ్నలుంటాయి. ఇందులో ఎనాటమీ 17, ఫిజియాలజీ 17 బయో కెమిస్ట్రీ 16 ఉంటాయి. పార్ట్ బిలో 150 ప్రశ్నలుంటాయి. ఇందులో జనరల్ మెడిస్ డెర్మటాలజీ, సైకియాట్రీ విభాగంలో 45 ప్రశ్నలు, జనరల్ సర్జరీ ఆర్ధోపెడిక్స్, అనస్థీషియా, రేడియో డయోగ్నసిస్‌లో 45 ప్రశ్నలు, గైనకాలజీలో 30 ఇలా ఉంటాయి.

పరీక్ష ఫీజు 4250 రూపాయలుగా ఉంది. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు 3250 రూపాయలు చెల్లించాలి. 

Also read: Slums Caught Fire: భీకర అగ్నిప్రమాదం.. 200 ఇళ్లు దగ్ధం.. ఆర్పుతున్న కొద్దీ అలానే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News