Opposition Parties Boycott New Parliament Building Inauguration Ceremony: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేడుకలను విపక్ష పార్టీలు బహిష్కరించాయి. నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని కాంగ్రెస్‌తో సహా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు విపక్ష పార్టీలు అన్ని కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో తమకు ఎలాంటి విలువ కనిపించడం లేదని పేర్కొన్నాయి. అందుకే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించామని ప్రకటనలో వెల్లడించాయి. ఈ నిరంకుశ ప్రధానికి.. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశాయి.
పార్లమెంట్ భవనం ప్రారంభోత్స కార్యక్రమం ముఖ్యమైన సందర్భం అని పేర్కొన్న విపక్షాలు.. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని మండిపడ్డాయి. కొత్త పార్లమెంట్‌ను నిరంకుశ పద్ధతిలో నిర్మించారని విమర్శించాయి. అయినా ఈ బృహత్తర కార్యక్రమం కోసం విభేదాలను పక్కన పెట్టడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించాయి. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పూర్తిగా విస్మరించి.. ప్రధాని మోదీతో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్న తీరు రాష్ట్రపతి పదవిని అవమానించడమేనని పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్ష దాడి అని ప్రకటనలో తెలిపాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉటంకిస్తూ.. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాదని.. పార్లమెంట్‌లో అంతర్భాగమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని.. రాష్ట్రపతి లేకుండా పార్లమెంటు పనిచేయదని తెలిపాయి. రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారని.. ఈ అనాలోచిత చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవిని అవమానించడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్లమెంట్‌ను తూతూమంత్రంగా చేస్తున్న మోదీకి.. అప్రజాస్వామిక చర్యలు కొత్తేమీ కాదని విమర్శించాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని భారీ ఖర్చుతో నిర్మించారని.. అయితే ప్రజలతో గానీ.. పార్లమెంటు సభ్యులతో గానీ సంప్రదింపులు జరపలేదని మండిపడ్డాయి.
Also Read: Jagananna Vidya Deevena Funds: గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook