Toll Plaza Rules: ఆ పసుపు గీత దాటితే చాలు..టోల్ రుసుము కట్టనక్కర్లేదిక

Toll Plaza Rules: జాతీయ రహదార్లపై టోల్ గేట్ ఛార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక టోల్ ప్లాజాల వద్ద కాస్సేపు నిరీక్షించినా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ గీత దాటితే..ఇక ఫ్రీ అంతే  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2021, 08:19 PM IST
Toll Plaza Rules: ఆ పసుపు గీత దాటితే చాలు..టోల్ రుసుము కట్టనక్కర్లేదిక

Toll Plaza Rules: జాతీయ రహదార్లపై టోల్ గేట్ ఛార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక టోల్ ప్లాజాల వద్ద కాస్సేపు నిరీక్షించినా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ గీత దాటితే..ఇక ఫ్రీ అంతే

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(National Highways Authority of India) కొత్తగా కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. జాతీయ రహదార్లపై ప్రయాణించేవారికి కచ్చితంగా ఇది శుభవార్తే. టోల్‌ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీ తనం తగ్గించేందుకు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. టోల్‌ప్లాజాల వద్ద సజావుగా ప్రయాణించేలా చూసేందుకు, టోల్‌ప్లాజా రద్దీగా ఉన్నప్పుడు వాహనదారులు 10 సెకన్ల కంటే ఎక్కువ నిరీక్షించకుండా ఉండేలా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలివి. 

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం..టోల్‌ప్లాజా(Toll plaza) నుంచి వంద మీటర్ల దూరంలో ఉండే పుసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే..అప్పుడు ఆ గీతకు ముందున్న వాహనాలు టోల్ ఛార్జీలు(Toll Charges) చెల్లించకుండా వెళ్లిపోవచ్చు. అంటే లైన్ పొడవు వంద మీటర్ల లోపుకు వచ్చేవరకూ ఉన్న వాహనాలు ఛార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చని కేంద్రం తెలిపింది. ఇదంతా టోల్‌ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం పెంచేందుకు, వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు తీసుకున్నట్టు ఎన్‌హెచ్‌ఏ తెలిపింది. ఇప్పటికే టోల్‌ప్లాజా రద్దీ తగ్గించేందుకు ఎన్‌హెచ్‌ఏ ఫాస్టాగ్ (FASTag) అమల్లోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ ఉంటే వాహనాలు ఆగకుండానే టోల్‌ప్లాజా దాటి వెళ్లిపోవచ్చు. వాహనం ముందున్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను ఆటోమెటిక్ సెన్సార్ కెమేరాలు స్కాన్ చేయడం ద్వారా డబ్బులు కట్ అవుతాయి. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో రద్దీ ఉండటంతో ఈ కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. 

Also read: Paytm IPO news: పేటీఎం ఐపీఓ ప్లాన్స్.. భారీ మొత్తంలో నిధుల సమీకరణకు స్కెచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News