నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. నిజానికి వారికి మార్చి 3నే ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. కానీ వారికి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. అంతే కాదు దోషుల్లో ఒక వ్యక్తి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకోవాల్సినందు వల్ల మార్చి 3న ఉరి శిక్ష అమలు చేయలేదు. ఐతే అన్నీ అవకాశాలు పూర్తి కావడంతో పాటియాలా హౌజ్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తాజా తీర్పు వెలువరించింది. వారికి ఆ రోజు తెల్లవారుజామున 5 గంటల 30 నిముషాలకు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. సోమవారం నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత అతని క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపించింది. నిన్న ఆ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో తీహార్ జైలు అధికారులు ఉరి శిక్ష అమలు చేసేందుకు కొత్త తేదీలు ఖరారు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం . . కొత్త తేదీని ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
Read Also: రజనీకాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడో తెలుసా..?
తాజా తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవీ హర్షం వ్యక్తం చేశారు. ఇదే చివరి తీర్పు అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వారికి మార్చి 20న ఉరి శిక్ష అమలు చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. Read Also: మిస్టర్ అండ్ మిస్ ట్రెయిలర్ విడుదల జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..