నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. నిజానికి వారికి మార్చి 3నే ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. కానీ వారికి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది.
2012 నాటి అత్యంత హేయమైన నిర్భయ కేసులో తుది అంకానికి సర్వం సిద్ధమవుతోంది. దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్ట్ డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉరి శిక్ష అమలుపై ఉత్కంఠ తొలగిపోయింది.
నిర్భయ కేసులో దోషులు ఎలా ఉన్నారు..? చివరి రోజుల్లో వారి మానసిక పరిస్థితి ఏంటి..? తీహార్ జైలులో వారి చివరి కొరికలు నెరవేరుతాయా..? నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3 న వారికి ఉరి శిక్షలు అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను నిర్భయ తల్లి క్షమించి వదిలేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ చేసిన విజ్ఞప్తి నిర్భయ తల్లి చాలా ఘాటుగా స్పందించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దోషులను సోనియా గాంధీ క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి నలుగురు దోషులను క్షమించాలని సీనియర్ న్యాయవాది తనను కోరడం ఏంటని మండిపడ్డారు. నీలాంటి వారి వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఇందిర జైసింగ్పై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారని యావత్ దేశమంతా ఎదురు చూస్తోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ 16నే దోషులను ఉరి తీస్తారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఐతే దోషుల్లో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ వేయడంతో దీనికి కొద్దిరోజులు బ్రేక్ పడినట్లయింది.
నిర్భయ ఘటనకు నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16న నిర్భయపై... దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు... కీచకపర్వానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించి అఘాయిత్యం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
ఏడేళ్లుగా పోరాడుతున్నాం... మరో ఏడు రోజులు ఆగలేమా ? ఆగుతాం... డిసెంబర్ 18న నిర్భయ కేసు దోషులకు డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందని భావిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్భయ కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. పటియాలా హౌస్ కోర్టులో నేడు కేసు విచారణ జరగాల్సి ఉంది. ఐతే అడిషనల్ సెషన్ జడ్జ్ సతీష్ కుమార్ అరోరా ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దిశపై సామూహిక అత్యాచారం, హత్య.. గతంలో నిర్భయ అత్యాచారం, హత్య వంటి ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను కచ్చితంగా ఉరి తీయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో తెలంగాణ పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.