టీవీ లైవ్‌లో మాట్లాడుతూ చనిపోయిన రీటా జితేందర్

జమ్మూకాశ్మీర్‌కి చెందిన ప్రముఖ పరిశోధకురాలు, సామాజిక కార్యకర్త రీటా జితేందర్ కన్నుమూశారు.

Updated: Sep 13, 2018, 04:48 PM IST
టీవీ లైవ్‌లో మాట్లాడుతూ చనిపోయిన రీటా జితేందర్

జమ్మూకాశ్మీర్‌కి చెందిన ప్రముఖ పరిశోధకురాలు, సామాజిక కార్యకర్త రీటా జితేందర్ కన్నుమూశారు. సోమవారం ఉదయం దూరదర్శన్‌కి చెందిన కాశ్మీర్ ఛానల్‌లో ప్రసారమయ్యే గుడ్ మార్నింగ్ కాశ్మీర్ షో లో అతిథిగా పాల్గొన్న ఆమె.. మాట్లాడుతూ కన్నుమూశారు.

డోగ్రి అంశంపై మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురై ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డ రీటా.. ఆ తర్వాత కిందపడిపోయింది. ఛానల్ సిబ్బంది స్పందించి SMHS ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేలోగే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పలువురు విద్యావేత్తలు రీటా మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. జమ్మూలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రీటా జితేంద్ర మరణం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.