Supreme Court says Nupur Sharma not to be arrested now: బీజేపీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మకు ఊరట లభించింది. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. నుపుర్ శర్మను ఇప్పుడు అరెస్టు చేయడం కుదరదని మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదని పేర్కొంది. జస్టిస్ సూర్య కాంత్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ప్రవక్త మహమ్మద్‌పై ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో చర్చా కార్యక్రమం సందర్భంగా నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో పలుచోట్ల అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 9 కేసులు నమోదయ్యాయి. ఇక ఉదయ్‌పూర్‌లో నుపుర్ వ్యాఖ్యలకు మద్దతుగా పోస్టు చేసిన ఓ వ్యక్తిని ఇద్దరు ముస్లింలు నరికి చంపిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్ల వల్ల అంతర్జాతీయంగా కూడా భారత్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తన నమోదైన కేసుల నేపథ్యంలో నుపుర్ శర్మ తనకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన జీవితం ప్రమాదంలో పడిందని.. హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున, దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన ఈ కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నుపుర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. దేశంలో మతవిద్వేషాలు రగలడానికి నుపుర్ వ్యాఖ్యలే కారణమని సుప్రీం అభిప్రాయపడింది. దేశానికే క్షమాపణ చెప్పాలని కోరింది.
అయితే నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మాజీ జడ్జ్‌ల నుంచి నిరసన వ్యక్తమైంది. సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలపై పునరాలోచించాలని కోరుతూ ఓ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నుపుర్ శర్మకు ఈరోజు ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేయడం కుదరదని చెప్పింది. ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదని తెలిపింది. ఇక ఆగస్టు 10వ తేదీన మళ్లీ నుపుర్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనున్నది.
Also Read: Oppo Reno8 Pro: ఒప్పో రెనో8 ప్రో 5జీ లాంచింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16500 తగ్గింపు...
Also Read: Rahul-Athiya Marriage: కేఎల్ రాహుల్-అతియా శెట్టిల వివాహం జరగదు.. అసలు కారణం ఇదే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook