చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష..?

12 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే వారికి మరణశిక్ష విధించేలా ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ ను సవరించేందుకు యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది.

Last Updated : Apr 21, 2018, 12:46 PM IST
చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష..?

12 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే వారికి మరణశిక్ష విధించేలా ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (POCSO)  చట్టాన్ని సవరించేందుకు యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది.  కథువా అత్యాచార, హత్య కేసుకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ పై స్పందిస్తూ కేంద్రం ఈ నివేదికను.. సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఏప్రిల్ 27న ఈ పిటిషన్, కేంద్రం నివేదికపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదని, ఇటువంటి సమయంలో దోషులను కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉంటేనే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కేంద్రం అభిప్రాయపడింది.

నేడు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం

ఢిల్లీలో నేడు ఉదయం 11:30 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఆర్థిక నేరగాళ్లను అరికట్టేందుకు బిల్లు, అత్యాచార నిరోధక చట్టంలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి ఈ భేటీలో బీజేపీ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జర్గిన కథువా, ఉన్నావ్ ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేబినేట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండన విధించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే వీలుంది. ఈ చట్టం కింద అత్యాచారానికి పాల్పడితే ముద్దాయికి కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవితఖైదు విధించే అవకాశముంది. లైంగికచర్య తర్వాత బాధితురాలు చనిపోయినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణశిక్ష/ఉరిశిక్ష విధించేలా ప్రోక్సో చట్టంలో నిబంధనలను మార్చేందుకు ప్రభుత్వం ఓ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెడుతుందనీ, అంతవరకూ అమల్లో ఉండేలా ఆర్డినెన్స్‌ను తీసుకొస్తుందని న్యాయాధికారి ఒకరు వెల్లడించారు.

Trending News