కోల్కతా : ప్రధాని మోదీ రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటన సంధర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. కోల్కతాలోని రాజ్భవన్లో ప్రధాని నరేంద్రమోదీని కలిసిన మమతా బెనర్జీ.. పౌరసత్వ సవరణ చట్టం 2019 (సిఎఎ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి), జాతీయ జనాభా పట్టిక ( NPR)ల అమలు ప్రక్రియను పున:పరిశీలించాలని కోరానని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పౌరసత్వ చట్టానికి, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకమని మమతా బెనర్జీ పీఎం మోదీతో అన్నారు.
మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మన అతిధి, మర్యాదపూర్వకంగా కలిశానని, ప్రధాని పై మాకు పూర్తి గౌరవం ఉందని, అయినప్పటికీ కేంద్రం తీసుకున్న సీఏఏ ఎన్ఆర్సి NPR లకు బెంగాల్ పూర్తిగా వ్యతిరేకమని ప్రధానితో చెప్పానని ఆమె అన్నారు. ఇదే విషయంపై ఢిల్లీలో సమావేశమవుదామని, తనను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారని ఆమె అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..