నెల రోజుల బ్రేక్ తర్వాత పెరిగిన పెట్రో ధరలు

Last Updated : Jul 5, 2018, 04:12 PM IST
నెల రోజుల బ్రేక్ తర్వాత పెరిగిన పెట్రో ధరలు

సరిగ్గా 36 రోజుల తరువాత మళ్లీ పెట్రో ధరలు పెరిగాయ్. తాజాగా నిర్ణయంతో లీటర్  పెట్రోల్ పై 16 నుంచి 17 పైసల వరకూ పెరిగింది. డీజెల్ ధరను 10 నుంచి 12 పైసల మేరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరగడం వల్లే పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.  తాజా ధరలు ఒక్కసారి తెలుసుకుందామా ...

ప్రాంతం  పెట్రోల్ ధర  డీజిల్ ధర
హైదరాబాద్ రూ. 80.08 రూ.74.87
చెన్నై రూ. 78.57 రూ. 71.24
ఢిల్లీ  రూ. 75.71 రూ. 67.50
ముంబై రూ. 83.10 రూ. 71.62
కోల్ కతా రూ.78.39

రూ. 80.50

మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉన్నట్టు తెలిసింది. దేశరాజధానిలో విక్రయ పన్ను లేదా వ్యాట్‌ తక్కువగా అమలు చేస్తుండటంతో ఈ ధర ఢిల్లీలో అన్ని నగరాలతో పోలిస్తే తక్కువగా ఉంది. కాగా పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.

Trending News