ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఉంది పరిస్థితి. అమెరికా, ఇరాన్ మధ్య పంచాయతీ భారత్ మీదకొస్తోంది. అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా పెట్రో రేట్లు పరుగు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
ఇంధనంపై సుంఖాన్ని తగ్గించి పెట్రో ధరల విషయంలో సామాన్య జనాలకు ఉపశమనం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ అదే భారం మోయమంటోంది ప్రభుత్వం. ప్రస్తుత ధరలను బట్టి చూస్తే ఈ విషయం తేటతెల్లమౌతుంది.
సరిగ్గా 36 రోజుల తరువాత మళ్లీ పెట్రో ధరలు పెరిగాయ్. తాజాగా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ పై 16 నుంచి 17 పైసల వరకూ పెరిగింది. డీజెల్ ధరను 10 నుంచి 12 పైసల మేరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరగడం వల్లే పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తాజా ధరలు ఒక్కసారి తెలుసుకుందామా ...
దీపావళి కానుకగా అభివర్ణిస్తూ పెట్రో ఉత్సత్తులపై దేశంలోని మూడు రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి. పెట్రోల్, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను ( వ్యాట్) తగ్గిస్తూ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ తో పాటు ముంబై, హిమాచర్ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. గుజరాత్ 4 శాతం , మహారాష్ట్ర ప్రభుత్వం 2 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో ఒక శాతం తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశీయంగా మాత్రం మార్పు లేకపోవడంపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.