Pm modi 3.0: మోదీ మార్క్ కేబినేట్.. కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Pm modi cabinet formation: ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఆయా మంత్రులకు శాఖల కేటాయింపులు కూడా చేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 10, 2024, 08:04 PM IST
  • స్పీడ్ పెంచిన మోదీ..
  • మంత్రులకు శాఖలు కేటాయింపులలో కీలక మార్పులు..
Pm modi 3.0: మోదీ మార్క్ కేబినేట్.. కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Narendra modi announces portfolio allocations for ministers: నరేంద్ర మోదీ మూడోసారి  దేశ ప్రధానిగా (ఆదివారం) ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారంచేశారు. మోదీతో పాటుగా మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  వీరిలో 30 మంది కేబినేట్ మంత్రులు కాగా, మరో 36 మంది సహయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు.మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు అంటే.. సోమవారం రోజున ఉదయం పీఎంవోలో బాధ్యతలు స్వీకరించారు. అంతే కాకుండా..దేశానికి వెన్నుముక అయిన రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులను కేటాయిస్తు తొలిసంతకం చేశారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడు రైతులు దేశానికి వెన్నముక లాంటి వారని చెబుతుంటారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

రైతులు ఆనందంగా ఉంటేనే.. దేశంలో ప్రతిఒక్కరు కడుపు నిండా అన్నం తినగలని చెబుతుంటారు. ఆయన అన్నట్లే రైతుల కోసం కిసాన్  సమ్మాన్ నిధులను విడుదల చేశారు. భవిష్యత్తులో రైతులకు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్లకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మోదీ కేంద్రలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో సమావేశం నిర్వహించారు.  ఈ క్రమంలో మంత్రులకు శాఖలకు కేటాయించారు. 

రక్షణ మంత్రి - రాజ్ నాథ్ సింగ్

హోంశాఖ - అమిత్ షా

విదేశాంగశాఖ - జైశంకర్

రోడ్డు రవాణా శాఖ - నితిన్ గడ్కరీ, 

ఆర్థిక శాఖ - నిర్మలా సీతారామన్

రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రులు - అజయ్ టమ్టా, హర్ష్ మల్హోత్రా

గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి - నమోహర్ లాల్ ఖట్టర్

పెట్రోలియం శాఖ - హర్దీప్ సింగ్ పూరి

రైల్వే, సమాచార, ప్రసార శాఖ - అశ్వినీ వైష్ణవ్

వాణిజ్యం - పీయూష్ గోయల్

పౌర విమానాయన శాఖ - రామ్మోహన్ నాయుడు

ధర్మేంద్ర ప్రధాన్- విద్యాశాఖ

జేపీ నడ్డా- వైద్య ఆరోగ్య శాఖ

శ్రీపాద నాయక్- విద్యుత్

గజేంద్ర షెకావత్-సాంస్కృతిక పర్యాటక శాఖ

భూపేంద్ర యాదవ్- పర్యావరణ శాఖ

శివరాజ్ సింగ్ చౌహన్- పంచాయతీ రాజ్, గ్రామీణం, వ్యవసాయ శాఖ

జీతన్‌రామ్ మాంఝీ- చిన్న, మధ్యతరహ పరిశ్రమలు

క్రీడలు- చిరాగ్ పాశ్వాన్

కిరణ్ రిజుజు- పార్లమెంటరీ వ్యవహరాలు

అశ్వనీ వైష్ణవ్ - రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు 

మన్‌సుఖ్‌ మాండవీయా - కార్మిక శాఖ, క్రీడలు

భూపేందర్ యాదవ్ - పర్యావరణ శాఖ 

సీఆర్‌ పాటిల్‌ - జల్‌ శక్తి శాఖ లకు కేటాయింపులు చేశారు.

సర్బానంద సోనోవాల్‌ - ఓడరేవులు, షిప్పింగ్‌

అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం 

ప్రహ్లాద్‌ జోషి - ఆహార, వినియోగదారుల సంక్షేమం

కుమార స్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు

చిరాగ్‌ పాశ్వాన్‌ - క్రీడా శాఖ

జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం, ఈశాన్య రాష్ట్రాలు

గిరిరాజ్ సింగ్ - జౌళి

కిషన్ రెడ్డి - బొగ్గు, గనుల శాఖ

బండి సంజయ్ - హోంశాఖ సహయ మంత్రి

భూపతిరాజు శ్రీనివాస వర్మ - ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి

రామ్మోహన్ నాయుడు - పౌరవిమానయానం

పెమ్మసాని చంద్రశేఖర్ - రూరల్ డెవలప్ మెంట్,కమ్యూనికేషన్స్

 

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News