దేశ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి, ప్రధాని

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం కొత్త సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Jan 1, 2018, 12:54 PM IST
దేశ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ, జనవరి1:  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం కొత్త సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు నాయకులు ట్విట్టర్ లో దేశ ప్రజలు కోసం శాంతి మరియు శ్రేయస్సును కోరుకున్నారు.

"ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2018 అందరి కుటుంబాలలో చిరునవ్వు, స్నేహం, శ్రేయస్సు తీసుకురావాలి" అని రాష్ట్రపతి ట్విట్టర్ లో  పేర్కొన్నారు. 

 

"అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సంపద మరియు మంచి ఆరోగ్యాన్ని తెస్తుందని నేను ప్రార్థిస్తున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 

 

Trending News