Omicron Scare: దేశంలో కొవిడ్​​ పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ సమీక్ష

Omicron Scare: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 07:43 AM IST
  • దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ భయాలు
  • ఢిల్లీ, మహారాష్ట్రలో భారీగా కేసులు
  • ప్రస్తుత పరిస్థితులపై నేడు ప్రధాని సమీక్ష
Omicron Scare: దేశంలో కొవిడ్​​ పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ సమీక్ష

Omicron Scare: దేశంలో కరోనా ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi latest news) నేడు (డిసెంబర్ 23) తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.

దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) బయపడ్డాయి. ఇందులో ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54 ఉన్నాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పటికే 90 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య విభాగం డేటా స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారీగా ఒమిక్రాన్​ కేసులు..

తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 24 వద్ద ఉంది. కర్ణాటకలో 19, రాజస్థాన్​లో 18 కేసులు బయపడ్డాయి. కేరళలో 15, గుజరాత్​లో 14, జమ్ము కశ్మీర్​లో మూడు కేసులు, ఒడిశా, ఉత్తర్​ ప్రదేశ్​లలో రెండు కేసుల చొప్పున వెలుగు చూశాయి.

ఆంధ్ర ప్రదేశ్​, చంఢీగడ్​, లద్ధాక్​, తమిళనాడు, పశ్చిమ్​ బెంగాల్​లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

కఠిన నిబంధనలు..

ఒమిక్రాన్​ భయాల నేపథ్యంలో.. కఠిన నిబంధనలు (Corona rules) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అవసరమైన చోట్ల కర్ఫ్యూ విధించడం.. గుమిగూడటం, పార్టీల వంటి వాటిపై ఆంక్షలు విధించాలని కూడా పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి.. టీకా వేసుకోని వారిని మాల్స్​లోకి అనుమతించకపోవడం వంటి నిబంధనలను విధించాయి.

ఒమిక్రన్​ కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. కరోనా కేసులు మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల వరుసగా కొత్త కేసులు 7 వేల దిగువనే నమోదవుతూ వస్తున్నాయి. యాక్టివ్​ కేసులు 80 వేల దిగువకు చేరాయి.

Also read: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు

Also read: Gurugram: కదులుతున్న ఆటో నుంచి దూకేసిన మహిళ.. భయానక అనుభవం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News