'కరోనా వైరస్'.. కారణంగా.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు రోడ్లపై కాపలా కాస్తున్నారు.
నిత్యావసరాలు, అత్యవసర పనుల కోసం జనం బయటకు వచ్చేందుకు ఉదయం 2 గంటలు సాయంత్ర 2 గంటలు అనుమతి ఇచ్చారు. కానీ జనం కొంత మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నారు. దీంతో పోలీసులు వారిని అక్కడికక్కడే శిక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గుంజీలు తీయిస్తుండగా .. మరికొన్ని ప్రాంతాల్లో వింత వింత శిక్షలు వేస్తున్నారు.
మరోవైపు కర్ణాటకలోని కలబుర్గిలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు రోడ్లపైనే డ్యూటీ చేస్తున్నారు. ఐతే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కొంత మంది బయట తిరుగుతున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేశారు. వాహనాలు ఆపి మరీ పక్కకు పిలిచి లాఠీలతో చితకబాదారు. ఇలాంటి ఘటనలు చూడడానికి బాధాకరంగా ఉన్నా.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు పోలీసులు. తమ విధి తాము నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు.
#WATCH Karnataka: Police resorts to lathi charge on people who were found violating the #COVID19 lockdown in Kalaburagi. Section 144 of CrPc has been extended till 7th May 2020 in the district, today. pic.twitter.com/M07PrWXhNm
— ANI (@ANI) April 30, 2020
మరోవైపు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేఫథ్యంలో విధించిన లాక్ డౌన్ మే 3 వరకు అమలులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఐతే కర్ణాటకలోని కలబుర్గిలో ప్రస్తుతం అమలులో ఉన్న సెక్షన్ 144 ను మే 7వ తేదీ వరకు పొడగించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
లాఠీ విరిగింది..!!