New Year's Eve: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్ర‌ధాని శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. 

Last Updated : Jan 1, 2021, 09:48 AM IST
New Year's Eve: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్ర‌ధాని శుభాకాంక్షలు

New year greetings: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నూతన సంవత్సర (New year 2021) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. కొత్త ఏడాది అందరూ ఆరోగ్యవంతంగా సుఖసంతోషాలతో ఉండాలంటూ రాష్ట్రపతి, ప్రధాని ట్విట్ చేశారు.

శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ, సహనంతో కూడిన సమాజం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) పిలుపు నిచ్చారు. ప్రతి కొత్త ఏడాది కొత్త ప్రారంభానికి అవకాశాలు అందిస్తుందని.. వ్యక్తిగత, సమైక్య అభివృద్ధికి సంకల్పం చేయాలని కోరారు. కొవిడ్-19 లాంటి కష్ట పరిస్థితుల్లో అందరం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. నూత‌న సంవ‌త్స‌రంలో దేశం పురోగ‌తిలో ముందుకు వెళ్తుంద‌ని.. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ట్విట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ప్ర‌తి ఒక్క‌రికి ఆరోగ్యం, ఆనందం, శ్రేయ‌స్సు తెస్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News