UGC New Chairman: యూజీసీ నూతన చైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియామకం

UGC Chairman: యూజీసీ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. తెలంగాణకు చెందిన జగదీశ్‌ కుమార్‌ను కొత్త యూజీసీ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 03:57 PM IST
  • యూజీసీ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తికి అవకాశం
  • తెలంగాణకు చెందిన జగదీశ్ కుమార్ నియామకం
UGC New Chairman: యూజీసీ నూతన చైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియామకం

UGC New Chairman M Jagadesh Kumar: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా తెలుగు వ్యక్తిని నియమించింది కేంద్రప్రభుత్వం (Central Govt). ప్రస్తుతం దిల్లీ జేఎన్‌యూ వైస్‌ఛాన్సలర్‌గా ఉన్న ఎం జగదీష్‌ కుమార్‌ (M Jagadesh Kumar) ను ఈ పదవికి ఎంపిక చేసింది. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. జగదీశ్‌ కుమార్‌.. యూజీసీ ఛైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి. గతంలో తెలుగువారైన వాసిరెడ్డి శ్రీకృష్ణ 1961లో, జి.రామిరెడ్డి 1991-95 వరకు యూజీసీ ఛైర్మన్లుగా పనిచేశారు.

"జగదీష్ కుమార్ కొత్త UGC ఛైర్మన్‌గా నియమితులయ్యారు" అని విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సీనియర్ అధికారి ధృవీకరించారు. 2018లో బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ డీపీ సింగ్ 65 ఏళ్లు నిండిన తర్వాత రాజీనామా చేయడంతో డిసెంబర్ 7న యూజీసీ చైర్మన్ పదవి ఖాళీ అయింది.

జగదీశ్‌ కుమార్‌..తెలంగాణ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన వ్యక్తి. 2016 జనవరి నుంచి జేఎన్‌యూ వీసీగా (JNU Vice-Chancellor) ఉన్న జగదీష్ కుమార్ పదవీకాలం ఈ నెల 26తో ముగస్తుంది. ఇటీవల యూజీసీ ఛైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ జారీ కాగా మొత్తం 55 మంది వరకు దరఖాస్తు చేసుకోగా..అందులో నుంచి ముగ్గురు పేర్లును కమిటీ ఎంపిక చేసి..కేంద్రప్రభుత్వానికి పంపింది. దీంతో ఆ పోస్టుకు జగదీశ్‌ కుమార్‌ను కేంద్రం ఎంపిక చేసింది. 

Also Read: Charanjit Singh Channi: పంజాబ్ లో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ...అక్రమ మైనింగ్ కేసులో సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News