Punjab New Cabinet: పంజాబ్‌లో కొత్త ఆప్ కేబినెట్ నేడే ప్రమాణ స్వీకారం, మంత్రులుగా ఎవరంటే..

Punjab New Cabinet: పంజాబ్ కొత్త మంత్రిమండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. పంజాబ్ ప్రజలకు ఓ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరెవరుంటారంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2022, 11:24 AM IST
 Punjab New Cabinet: పంజాబ్‌లో కొత్త ఆప్ కేబినెట్ నేడే ప్రమాణ స్వీకారం, మంత్రులుగా ఎవరంటే..

Punjab New Cabinet: పంజాబ్ కొత్త మంత్రిమండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. పంజాబ్ ప్రజలకు ఓ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరెవరుంటారంటే..

పంజాబ్‌లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కేబినెట్ ప్రమాణస్వీకారం చేయనుంది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చండీగఢ్‌లో జరగనుంది. పంజాబ్‌లో ఏర్పడనున్న కొత్త కేబినెట్‌లో 8-10 మంది మంత్రులుంటారని తెలుస్తోంది. మంత్రిమండలి ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నెల 23వ తేదీన మంత్రిమండలి తొలి సమావేశం జరగనుంది. పంజాబ్ కొత్త స్పీకర్‌గా కుల్తార్ సింగ్ సంఘ్వాను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కోటక్‌పురా అసెంబ్లీ నుంచి కుల్తార్ సింగ్ సంఘ్వా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

పంజాబ్ కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయనుందని..పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో కాబోయే మంత్రులకు శుభాకాంక్షలు అందిస్తున్నానని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ట్వీట్ చేశారు. పంజాబ్ ప్రజలు తమకు చాలా పెద్ద బాథ్యతలు అప్పగించారని..రేయింబవళ్లు కష్టపడి ప్రజలకు సేవ చేయాలని..పంజాబ్ రాష్ట్రానికి ఒక నిజాయితీ ప్రభుత్వాన్ని అందించాలని చెప్పారు. 

పంజాబ్ ఆప్ ప్రభుత్వంలో మంత్రులు ఎవరు

పంజాబ్ కేబినెట్‌లో 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో హర్‌పాల్ సింహ్ చీమా, డాక్టర్ బల్జీత్ కౌర్, హర్‌భజన్ సింహ్, డాక్టర్ విజయ్ సింగ్లా, గురుమీర్ సింగ్ మీత్ హైర్, హర్జోత్ సింహ్ భైన్స్, లాల్‌చంద్, కుల్దీప్ సింగ్ ధానీవాల్, లాల్జీత్ సింహ్ భుల్లర్, బ్రహ్మ శంకర్ జింపాలు ఉంటారు.

Also read: Corona Fourth Wave: కరోనా ఫోర్త్‌వేవ్‌పై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజా హెచ్చరికలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News