Rahul Gandhi slams PM Modi సైనికులకు సాధారణ ట్రక్కులు.. ప్రధానికి రూ. 8.400 కోట్ల విమానమా ?

Rahul Gandhi tweet on PM Modi' VIP aircraft: న్యూ ఢిల్లీ: సైనికుల రక్షణను గాలికొదిలేసిన కేంద్రం.. ప్రధాని నరేంద్ర మోదీ కోసం రూ. 8.400 కోట్ల ఖరీదైన విమానాలను సమకూర్చుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

Last Updated : Oct 11, 2020, 03:44 AM IST
Rahul Gandhi slams PM Modi సైనికులకు సాధారణ ట్రక్కులు.. ప్రధానికి రూ. 8.400 కోట్ల విమానమా ?

Rahul Gandhi tweet on PM Modi' VIP aircraft Air India one: న్యూ ఢిల్లీ: సైనికుల రక్షణను గాలికొదిలేసిన కేంద్రం.. ప్రధాని నరేంద్ర మోదీ కోసం రూ. 8.400 కోట్ల ఖరీదైన విమానాలను సమకూర్చుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకవైపు సరిహద్దుల్లో దేశ భద్రతకోసం శ్రమిస్తున్న జవాన్లు ( Soldiers in non-bullet-proof trucks ) కనీస రక్షణ లేకుండా బుల్లెట్ ప్రూఫ్ లేని సాధారణ ట్రక్కుల్లో ప్రయాణిస్తుండగా... మరోవైపు కేంద్రం మాత్రం ప్రధాని మోదీ కోసం ఖరీదైన విమానాలు ఏర్పాటు చేస్తోందని.. ఇది న్యాయమేనా అని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. Also read : Air India One: ప్రధాని మోదీ కోసం అమెరికా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే

ఓ ట్రక్కులో ఎక్కి కూర్చున్న కొందరు సైనికులు తమలో తాము మాట్లాడుకుంటూ.. మనం నాన్-బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కులో వెళ్తున్నామని, ఇది ఏ మాత్రం సురక్షితం కాదని వాపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. సీనియర్ అధికారులు బులెట్ ప్రూఫ్ వాహానాల్లో ( Bullet-proof vehicles ) వెళ్తూ.. మనల్ని మాత్రం ఇలాంటి డొక్కు ట్రక్కుల్లో పంపించి మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సదరు జవాన్ ఆవేదన వ్యక్తంచేస్తుండటం రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ట్వీట్ చేసిన వీడియోలో చూడొచ్చు. Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

Trending News