Air India One: ప్రధాని మోదీ కోసం అమెరికా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే

భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. 

Last Updated : Oct 2, 2020, 03:09 PM IST
    • భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.
    • అమెరికా అధ్యక్షుడు వినియోగించే ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో ఈ విమానంలో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది.
    • ప్రధానితో పాటు, రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి కూడా వీటిని వినియోగించనున్నారు.
Air India One: ప్రధాని మోదీ కోసం అమెరికా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్  ప్రత్యేకతలు ఇవే

భారత ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. అమెరికా అధ్యక్షుడు ( US President ) వినియోగించే ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో ఈ విమానంలో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. ప్రధానితో పాటు, రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి కూడా వీటిని వినియోగించనున్నారు.
ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?

ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలివే | Key Features in Air India One

- ఈ సూపర్ విఐపీ ప్లేన్ అత్యధికంగా గంటకు 900 కిలో మీటర్లు ప్రయాణించగలదు.
- ఈ విమానం ఎంత శక్తివంతం అయింది అంటే ఇది శత్రువు నుంచి వచ్చే మిసైల్ ను కూడా నిర్వీర్యం చేయగలదు.
-  అమెరికాలో భారత ప్రధాని కోసం తయారు అయిన ప్రత్యేక విమానం ఇది.
- అమెరికా (America ) ప్రెసిడెంట్ విమానంలో ఉండే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

- ఇందులో ఉన్న ఆధునిక ఇన్ ఫ్రారెడ్ సిగ్నల్ తో ఇది ఫైర్ అయిన మిసైన్ ను దారి తప్పేలా చేస్తుంది. అంటే ఎవరైనా ఈ విమానంలపై మిసైల్ దాడి చేస్తే అది క్షణాల్లో నిర్వీర్యం అవుతుంది.
- శత్రువు రాడార్ ను జామ్ చేస్తుంది.
- ఈ విమానంలో ఒక ప్రత్యేక రాడార్ ఉంది. ఇది ఎంత శక్తివంతం అయింది అంటే శత్రువు రాడార్ సిగ్నల్స్ ను కూడా పట్టుకోగలదు. 
- ఎయిర్ ఇండియా వన్ లో సెల్ఫ్ డిఫెన్స్ సూట్స్ కూడా ఉన్నాయి. 
- స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమ్యూనికేషనస్ వ్యవస్థ ఉంది. 
- గాలిలోనే ఇందులో ఇంధనాన్ని నింపే అవకాశం ఉంది. 

 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

మరిన్ని విశేషాలు

  •  ఎయిర్ ఫోర్స్ వన్ రాకతో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి భద్ర మరింత కట్టుదిట్టం అయింది.  డొమెస్టిక్ ట్రావెలింగ్ కోసం ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని వాడనున్నారు.  
  • సాధారణంగా అయితే అంతర్జాతీయ  ప్రయాణం కోసం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్-747 విమానాన్ని వాడతారు. 
  • అయితే కొత్తగా వచ్చినన ఎయిర్ ఇండియా వన్ విమానాలను వీవీఐపీ ఫ్లీట్స్ లో చేర్చి బోయింగ్-747 విమానాన్ని ఎయిర్ ఇండియా వీవీఐపీ ఫ్లీట నుంచి తొలగించనున్నారు.
  • కొత్త గా వచ్చిన ఈ ఎయిర్ ఇండియా వన్ విమానం బ్రేక్ లేకుండా ప్రయాణించగలదు. ఎయిర్ ఇండియా వన్ విలువ సుమారు రూ.8,458 కోట్లు.
  • A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
  • Android Link - https://bit.ly/3hDyh4G

    IOS Link - https://apple.co/3loQYeR

Trending News