'పకోడా' తిని, టీ తాగిన రాహుల్.. బీజేపీకి కౌంటర్

రాహుల్ గాంధీ 'జన ఆశీర్వాద యాత్ర' సమయంలో కమలా గ్రామానికి చెందిన స్థానిక డాభా వద్ద టీ బ్రేక్ కోసం ఆగారు.

Last Updated : Feb 12, 2018, 04:08 PM IST
'పకోడా' తిని, టీ తాగిన రాహుల్.. బీజేపీకి కౌంటర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 'జన ఆశీర్వాద యాత్ర'లో భాగంగా సోమవారం రాయచూరు జిల్లాలో పర్యటించారు. కమలా గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన హోటల్ లోకి వెళ్లి టీ, పకోడా మిర్చి (కన్నడలో 'బజ్జీ' అని పిలుస్తారు) ఆరగించారు.

రాహుల్ కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రకటించలేదు. కర్నాటకలో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మే30, 2018తో ముగియనుంది. ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   

రాహుల్ గాంధీ 'జన ఆశీర్వాద యాత్ర' సమయంలో కమలా గ్రామానికి చెందిన స్థానిక డాభా వద్ద టీ బ్రేక్ కోసం ఆగారు. ఆయన కాంగ్రెస్ నాయకులతో పాటు హోటల్ లోకి వెళ్లి మిర్చి బుజ్జి, అన్నం భుజించారు. ఈ యాత్రలో రాహుల్ తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, కర్నాటక పార్టీ ఇంచార్జ్ కె.సి.వేణుగోపాల్, మంత్రి డికె శివకుమార్ ఉన్నారు.

యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిద్దరామయ్యతో కలిసి రాయచూరులో దర్గాను సందర్శించి, ఆ తరువాత నగరంలో రోడ్ షోని నిర్వహించారు.

గతంలో పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనంటూ పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతూ, నిరుద్యోగం అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి సమాధానంగా అమిత్ షా పకోడీ రిప్లై ఇచ్చారు. అనంతరం దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయింది.

Trending News