ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్... ఐఓబీ, యాక్సిస్ బ్యాంకులకు భారీ జరిమానా..!

ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను పాటించనందుకు రెండు బ్యాంకులకు భారీ జరిమానాను విధించింది.

Last Updated : Mar 6, 2018, 11:44 AM IST
ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్... ఐఓబీ, యాక్సిస్ బ్యాంకులకు భారీ జరిమానా..!

ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను పాటించనందుకు రెండు బ్యాంకులకు భారీ జరిమానాను విధించింది. కేవైసీ (నో యువర్ కస్టమర్) అంశానికి సంబంధించి ఆర్బీఐ ప్రతిపాదించిన పలు గైడ్ లైన్స్‌కు అనుగుణంగా నడుచుకోకపోవడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకి 2 కోట్ల రూపాయలను జరిమానాగా విధించగా.. బ్యాంకింగ్ భద్రతా నియమాలకు సంబంధించి పలు నియమాలు పాటించనందుకు యాక్సిస్ బ్యాంకుకి 3 కోట్ల రూపాయలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పెనాల్టీ విధించింది.  రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టాలలోని సెక్షన్ 47 ఏ (1)సితో పాటు సెక్షన్ 46 (4) ఐను అనుసరించి ఈ బ్యాంకులపై చర్యలు తీసుకొన్నామని.. పెనాల్టీ విధించామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. 

Trending News