Republic Day 2022: యూపీ శకటానికి ప్రథమ బహుమతి.. రెండో స్థానంలో కర్ణాటక..

R-Day Tableau: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కవాతులో మెుత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 02:13 PM IST
Republic Day 2022: యూపీ శకటానికి ప్రథమ బహుమతి.. రెండో స్థానంలో కర్ణాటక..

Republic Day parade: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో (Republic Day parade 2022) మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు పోటీపడ్డాయి. ఇందులో ‘'కాశీ విశ్వనాథ్‌ ధామ్‌'’ పేరిట శకటాన్ని రూపొందించిన ఉత్తరప్రదేశ్ కు ఉత్తమ అవార్డు (UP wins best tableau award) లభించింది. 'సంప్రదాయ చేనేత ఉత్పత్తుల' ఇతివృత్తంతో రూపొందిన కర్ణాటక శకటం ద్వితీయస్థానం దక్కించుకోంది. సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించిన మేఘాలయ మూడోస్థానంలో నిలిచినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

కేంద్ర మంత్రిత్వశాఖల విభాగంలో.. విద్య, పౌర విమానయాన శాఖల శకటాలు సంయుక్త విజేతలుగా నిలిచాయి. విద్యాశాఖ 'జాతీయ విద్యా విధానం' థీమ్ తోనూ..పౌరవిమానయాన శాఖ `ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్` థీమ్ తోనూ శకటాలను రూపొందించాయి. మొత్తం తొమ్మిది శాఖలు ఈ విభాగంలో పోటీపడగా.. ప్రజల ఎంపికలో సమాచార మంత్రిత్వ శాఖ విజేతగా నిలిచింది. పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణశాఖ శకటానికి ప్రత్యేక బహుమతి దక్కింది. త్రివిధ దళాల కవాతులో నౌకాదళం (Indian Navy) ప్రథమ బహుమతి గెలుచుకొన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. 

Also Read: UP Polls 2022: రాజకీయాలకు పాకిన 'పుష్ప' ఫీవర్... యూపీ ఎన్నికల కోసం 'శ్రీవల్లి' సాంగ్ ను వాడుకున్న కాంగ్రెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News