RBI Good News: ఆర్బీఐ గుడ్‌న్యూస్, 2 వేల నోటు మార్చేందుకు మరో వారం రోజులు గడువు

RBI Good News: ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన 2 వేల నోటు ఇకపై కన్పించదు. ఆర్బీఐ ఉపసంహరించుకున్న ఈ నోటును మార్చుకునేందుకు మరో వారం రోజులు గడువు పొడిగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2023, 05:27 PM IST
RBI Good News: ఆర్బీఐ గుడ్‌న్యూస్, 2 వేల నోటు మార్చేందుకు మరో వారం రోజులు గడువు

RBI Good News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో 2000 నోటు విషయంలో షాకింగ్ న్యూస్ విన్పించింది. మార్కెట్ నుంచి ఈ పెద్దనోటును ఉపసంహరిస్తున్నట్టు ప్రకటిస్తూ మార్చుకునేందుకు ఆరు నెలలు గడువిచ్చింది. ఈ గడువు కాస్తా ఇవాళ్టితో ముగియనుండటంతో మరో వారం రోజులు గడువు పెంచుతున్నట్టు ప్రకటించింది. 

పెద్ద నోట్ల రద్దు లేదా డీమానిటైజేషన్‌లో భాగంగా ఆర్బీఐ 2016 సంవత్సరం నవంబర్ 8వ తేదీన 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. పింక్ నోట్‌గా భారతీయ కరెన్సీలో ప్రవేశించిన ఈ నోటు చాలా ఆకర్షణీయంగా వాడుకలో కన్పించింది. ఈ నోటు 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీ అరికట్టేందుకు ప్రభుత్వం తలపెట్టిన డీమానిటైజేషన్‌లో భాగంగా ఈ నోటు మార్కెట్‌లో చేరింది. అయితే ఇటీవల అంటే 2023 మార్చ్ 19వ తేదీన 2000 రూపాయల నోటును తిరిగి ఉపసంహరిస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చుకునేందుకు నాలుగు నెలల గడువిచ్చింది. ఆ గడువు కాస్తా ఇవాళ్టితో అంటే సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. దాంతో చాలామందిలో ఆందోళన కన్పించింది. ఇంకా పూర్తి స్థాయిలో నోట్ల మార్పిడి జరగలేదని తెలుస్తోంది. దాంతో ఆర్బీఐ 2000 రూపాయల నోటు మార్చుకునేందుకు గడువు పొడిగించింది. 

ఆర్బీఐ గడువు పెంచుతుందా లేదా అనే సందేహం చాలామందిలో నెలకొంది. అందరి అంచనాల్ని నిజం చేస్తూ గడువు అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. ఇప్పటికీ ఇంకా ఎవరైనా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే ఈ వారం రోజుల్లో త్వరపడాల్సి ఉంటుంది. 

Also read: Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచే, స్మార్ట్‌టీవీలపై 60 శాతం డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News