ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏఐడీఎంకే పార్టీ పెద్ద ఎత్తున నగదును పంపిణీ చేస్తుందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే పార్టీ కోశాధికారి ఎం.కె. స్టాలిన్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఏఐడీఎంకే పార్టీ 100 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు స్టాలిన్ ఆరోపించారు.
"తమిళనాడులోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల కోసం ఓటర్లకి రూ.100 కోట్ల రూపాయల మేర పెద్ద మొత్తంలో డబ్బును పంపిణీ చేస్తున్నారు" అని స్టాలిన్ తన లేఖలో రాశారు.
DMK's MK Stalin writes to the Election Commission of India, says "#TamilNadu witnessing large-scale distribution of money to the tune of more than Rs.100 Crores by the ruling AIADMK party to the voters for by-election to RK Nagar Assembly Constituency" pic.twitter.com/xAwmtDtyGS
— ANI (@ANI) December 17, 2017
ఏఐడీఎంకే పార్టీ అభ్యర్థి ఇ. మధుసూదనన్‌ను ఈ ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఏఐడీఎంకే పార్టీ పై తగిన చర్యలు తీసుకొని, ఆర్కే నగర్ బైపోల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఉపఎన్నికలో ప్రధాన పోటీ ఏఐడీఎంకే అభ్యర్థి మధుసూధనన్ మరియు డిఎంకె అభ్యర్ధి ఎన్. మరుదుగణేష్‌ల మధ్య ఉండబోతోంది. బహిష్కృత ఏఐడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్ధిగా బైపోల్‌లో నిలబడ్డారు.
DMK's MK Stalin also requests Election Commission to disqualify AIADMK candidate E.Madhusudhanan, says "take appropriate and necessary action against AIADMK and the erring officials and to ensure free and fair election RK Nagar Assembly Constituency"
— ANI (@ANI) December 17, 2017
మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత ఆర్కే నగర్‌లో ఉపఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా మారింది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీకి ఈ ఎన్నిక ఒక లిట్మస్ టెస్టు అని చెప్పవచ్చు.