గుజరాత్ శాసనసభ్యుడు, దళిత నాయకుడు జిగ్నే్ష్ మెవానీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటిలో కులవివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధికమ్మ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని.. అలా పోటీ చేయడం ద్వారా కేంద్రమంత్రి స్మృతి ఇరానికి బుద్ధి చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు.
స్మృతి ఇరానిని మనుస్మృతి ఇరాని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా కూడా తెలిపారు. రోహిత్ మరణాన్ని ఆయన "ఇనిస్టిట్యూషన్ మర్డర్"గా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు వచ్చి జైల్లో ఉన్న మందక్రిష్ణ మాదిగ (మాదిగల రిజర్వేషన్ పోరాట సమతి నాయకుడు)ను పరామర్శించిన మెవానీ మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో దళిత ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన తెలిపారు. ఇటీవలే జరిగిన గుజరాత్ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్‌కు, బిజేపీకి షాక్ ఇస్తూ.. జిగ్నేష్ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.
I strongly appeal to our inspiration Radhika(amma)Vemula to contest in 2019 elections and teach a lesson to Manusmriti Irani in Parliament.
— Jignesh Mevani (@jigneshmevani80) January 18, 2018