Southern Railway Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి దక్షిణ మధ్య రైల్వే (Southern Railway) గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ రైల్వేలో జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే ఈ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ నెల 5 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ దరఖాస్తును మీరు సబ్మిట్ చేసే క్రమంలో తప్పకుండా నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని డాక్యూమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేస్తేనే దరఖాస్తు ప్రక్రియ చివరికి చేరుతుంది.
అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే నెల రోజుల సమయం ఇచ్చింది. జూన్ 5లోపు అర్హత, ఆసక్తి కలిగిన వ్యక్తులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే (Southern Railway) దాదాపు 28 ఖాళీలను భర్తీ చేస్తుందని పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్ గల విద్యార్హత కలిగిన వ్యక్తులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ జాబ్ అప్లై చేసుకునే అభ్యర్థులు 42 ఏళ్లలోపు ఉండాలి. అంతేకాకుండా SC/ST గల అభ్యర్థులకు పరిమితిలో కొన్ని సడలింపులను కూడా దక్షిణ మధ్య రైల్వే ఇచ్చింది. మరింత సమాచారం కోసం దరఖాస్తు కోసం అధికారిక వెబ్ సైట్ https://rrcmas.in/ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ. 44,900 వేతనంతో పాటు వసతి సౌకర్యాలు కూడా చెల్లిస్తారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RRB Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, దక్షిణ మధ్య రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్!