ఆచూకీ గుర్తిస్తే.. రూ.2కోట్లు ఇస్తాం: కాయిన్‌ సెక్యూర్‌

‘చోరీకి గురైన బిట్‌కాయిన్లను గుర్తించడంలో సాయం చేసిన వారికి 10శాతం బహుమతి అందిస్తాం’ అని కాయిన్‌ సెక్యూర్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Last Updated : Apr 15, 2018, 05:38 PM IST
ఆచూకీ గుర్తిస్తే.. రూ.2కోట్లు ఇస్తాం: కాయిన్‌ సెక్యూర్‌

ఢిల్లీకి చెందిన ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్‌ సెక్యూర్‌ నుంచి రూ. 20కోట్లకు పైగా విలువైన 438 బిట్‌కాయిన్లు చోరీకి గురయ్యాయి. వీటిని ఎవరు దొంగలించారో తెలుసుకొనేందుకు కంపెనీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఓ నిర్ణయానికి వచ్చి బహిరంగ ప్రకటన చేసింది. బిట్‌కాయిన్ల ఆచూకీ గుర్తించిన వారికి భారీ నజరానా అందిస్తామని ప్రకటించింది.

‘చోరీకి గురైన బిట్‌కాయిన్లను గుర్తించడంలో సాయం చేసిన వారికి 10 శాతం బహుమతి ఇస్తాం’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. చోరీకి గురైన బిట్‌కాయిన్ల విలువ రూ. 20కోట్లకు పైనే. దీనిలో 10శాతం అంటే రూ.2కోట్లకు పైగా బహుమతి ఇవ్వనున్నారు.

రూ.20కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరీకి గురైనట్లు దిల్లీకి చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్‌ సెక్యూర్‌ సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేసింది. దేశంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఇదే కావడం గమనార్హం. కాయిన్ సెక్యూర్ ప్రకారం, సంస్థ వ్యాలెట్‌ నుంచి ఈ నగదును సిఎస్‌వో అమితాబ్‌ సక్సేనా దొంగతనం చేశారని..ఆయన దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వెంటనే ఆయన పాస్‌పోర్టు సీజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

కాయిన్‌ క్యూర్‌ ఎక్స్ఛేంజీకి దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా యూజర్లున్నారు. ఈ ఎక్స్ఛేంజీలో యూజర్లు ఆఫ్‌లైన్‌లో స్టోర్‌ చేసుకున్న బిట్‌కాయిన్లు అదృశ్యమయ్యాయి. బిట్‌కాయిన్లను స్టోర్‌ చేసుకునేందుకు ఉపయోగించే యూజర్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటి ద్వారా హ్యాకింగ్‌ చేసి బిట్‌కాయిన్లను దొంగలించినట్లు సంస్థ భావిస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ తమ యూజర్లకు ఈమెయిల్స్ ద్వారా చెప్పింది.

Trending News