'కరోనా వైరస్'.. ఉద్ధృతి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో లక్షణాలు కనిపిస్తే.. కచ్చితంగా ఎవరైనా చికిత్స తీసుకోవాల్సిందే. కానీ కొంత మంది కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా చికిత్స తీసుకోవడం లేదు. పైగా క్వారంటైన్‌కు తరలించినా అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నా.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారిలో 60 శాతం మందికి లక్షణాలు లేకుండానే ఉన్నాయి. ఐతే ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కానీ ఇందుకు విరుద్ధమైన ఘటన కర్ణాటకలోని పదరాయనపురలో జరిగింది. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు తరలించేందుకు బృహత్ బెంగళూరు మహానగరపాలిక సిబ్బంది ప్రయత్నించారు. కానీ వారిపై ఒక్కసారిగా ఓ గుంపు దాడికి పాల్పడ్డారు. మహానగరపాలిక సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టారు. కరోనా వైరస్ సోకిన వారిని ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించారు.
#UPDATE 54 people have been arrested & taken into custody. Officials needed to quarantine some people who had primary & secondary contact with 3 #COVID19 patients. 4 FIRs have been lodged at JJ Nagar Police station: Soumendu Mukherjee, Addl Commissioner of Police, Benglauru West https://t.co/orGnkChPz9
— ANI (@ANI) April 20, 2020
మరోవైపు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. గుంపును ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ఘటనలో పాల్గొన్న 54 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 4 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ రోజు ఘటనా స్థలాన్ని కర్ణాటక హోమ్ మంత్రి బస్వరాజ్ బొమ్మై సందర్శించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
కర్ణాటకలో రెచ్చిపోయిన గుంపు